top of page

దీర్ఘకాలిక రుణాలు

హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, గొర్రెలు మరియు పాడి పశువులను కొనుగోలు చేయడానికి పిఎసిఎస్ పోతుగల్ దీర్ఘకాలిక రుణాలను అందిస్తుంది.

 

రుణ మొత్తాన్ని రైతు భూమి యొక్క ప్రభుత్వ విలువపై నిర్ణయిస్తారు. ప్రస్తుత విలువ ఎకరానికి రూపాయలు 1,50,000 వుంది .

రుణ మొత్తాన్ని 5 సంవత్సరాల లోపు  సంవత్సరంలో రెండుసార్లు చెల్లించాలి.

 

హార్వెస్టర్ మరియు ట్రాక్టర్ కొనుగోలు కోసం డీలర్ నుండి కొటేషన్ అవసరం.

 

హార్వెస్టర్ మరియు ట్రాక్టర్లలో 70% రుణంగా ఇవ్వబడుతుంది.

 

గొర్రెలు మరియు పాడి పశువుల రుణ మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వ విలువ ప్రకారం నిర్ణయిస్తారు.

 

1,00,000 రూపాయల కంటే ఎక్కువ రుణ మొత్తానికి 15,000 రూపాయలు తిరిగి చెల్లించబడె మూలధనం తిసుకోబడును. 

 

లీగల్ రుసుము 1,000, స్టాంప్ డ్యూటీ రుసుము 1% రుణం 3 లక్షలు వరకు మరియు 3 లక్షలకు పైన, 0.5% స్టాంప్ డ్యూటీ సుంకం రైతు చెల్లించాలి

బి క్లాస్ సభ్యత్వ రుసుము 100 రూపాయలు (ఒకవేళ ఆ వ్యక్తికి సొసైటీలో సభ్యత్వం ఉంటే, బి క్లాస్ ఫీజు మినహాయింపు ఇవ్వబడుతుంది).

 

అవసరమైన పత్రాలు:

 

1. MRO నుండి 13 సంవత్సరాలు పహాని.

2. మీ సేవ నుండి 1B మరియు తాజా పహాని.

3. పాత మరియు కొత్త పట్టేదార్ పాస్‌బుక్.

4. సబ్ రిజిస్ట్రార్ నుండి ఇసి / వాల్యుయేషన్ సర్టిఫికేట్.

5. MRO లేదా సర్వేయర్ నుండి రైతు భూమి యొక్క మ్యాప్

 

 

రుణ మొత్తం పంపిణి:

harvester distribution with tscob chairm
tractor distribution 2015.jpg
bottom of page